Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎంబీసీ జాతీయ అధ్యక్షులు, దూదేకుల జాతీయ అధ్యక్షు లు అబ్దుల్ సత్తార్ అన్నారు. సోమవారం పురానాపూల్ లోని అఫ్జల్‌గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా ర్థులందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు, పెన్నులు, పెన్సీళ్ళు, మిఠాయిలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా రేపటి డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిపుణులు, ఉన్నత ఉద్యోగాలు పొందుతారని తెలిపారు. జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రసంగిస్తూ ప్రభుత్వం విద్య, వైద్యన్ని ఉచితంగా ప్రజలకు అందించా లని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.ఎల్.పద్మజా కుమారి, తెలుగు పండితులు డాక్టర్. ఎస్.విజయ భాస్కర్, సి.హరిశంకర్, సి.శివశంకర్, అశోక్ బాబు, సుచరిత, కౌసర్ ఫాతిమా, బబిత, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.