Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం అంబర్పేట అసెంబ్లీ నియోజకవ ర్గంలో అలీ కేఫ్ దగ్గర పాదయాత్ర నిర్వహించి ఈ సంద ర్భంగా విద్యుత్ సమస్య గురించి ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలని భావించిన మంత్రి సంబంధిత శాఖ అధికారులు అందుబా టులో లేకపోవడంతో మండి పడ్డారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. సమస్యల పరిష్కారం కోసం తాము ప్రజల్లో తిరుగుతుంటే ''మీరెక్కడ'' అంటూ ప్రశ్నిం చారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశిం చారు. సమాచారం ఇచ్చినా అధికారులు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. బస్తీల్లో వాటర్ పైప్ లైన్ కోసం తీసిన కాల్వలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. అనం తరం మంత్రి మాట్లాడుతూ అధికారులు కనీసం తమ విధులను కూడా సరిగా నిర్వర్తించకపోవడం సరికాదన్నా రు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నె ఉమా రమేష్ యాదవ్, పద్మా వెంకటరెడ్డి, అమృత, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, డివిజన్ అధ్యక్షులు నాగభూషణం చారి, గంధమాల ఆనంద్ గౌడ్, యశ్వంత్, భిక్షపతి, కృష్ణ ముదిరాజ్, మనోజ్ యాదవ్, తిరుపుతి గుప్తా, ఈశ్వర్ రావు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.