Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు ఎంతో అవసర మని నిమ్స్ డైరెక్టర్ భీరప్ప, అడిషనల్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాసులు అన్నారు. పేదరికం కారణంగా విద్య, వైద్యా నికి దూరంగా ఉంటున్న నిరుపేదలకు సేవలు అందించ డమే లక్ష్యంగా పని చేస్తున్న హీల్ సంస్థ పంజాగుట్టలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ సోమవారం ద్వారకాపురి కాలనీలో ఏర్పాటు చేసిన సెంటరును వారు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. రూ.10కే పేద ధనిక అనే తేడా లేకుండా వైద్యులు రోగులకు సేవలు అందిస్తారని సంస్థ వ్యవస్థాప కులు డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్ తెలిపారు. గైనకాలజీ, పీడియాట్రిక్, డెర్మటాలజీ, ఫ్యామిలీ మెడిసిన్‌తో పాటు పది విభాగాలకు చెందిన వైద్యులు వచ్చే నెల 22వ తేదీ నుంచి సేవలు అందిస్తారన్నారు. ఇదే కార్యాలయంలో విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ సెంటర్ అందుబాటులో ఉంచినట్టు సంస్థ డైరెక్టర్ మణిమాల తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గీతిక, సబితా దేవి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.