Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించాల్సిన సిబ్బంది భారీ కొమ్మలను నిరికివేయటంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం చెట్లు ప్రగతి మెట్లు, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని చెపుతుంటే విద్యుత్ అధికారులు మాత్రం ట్రి కటింగ్ పేరుతో చెట్టుకు ఉన్న పెద్ద పెద్ద కొమ్మలను కొటివేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సోమవారం బాగ్ లింగంపల్లి, సుందరయ్య పార్కు పరిసర ప్రాంతాల్లో సంబంధిత ఏడిఈ విజరు భాస్కర్ ఆధ్వర్యంలో కొమ్మలను కొట్టివేశారు. ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే మా సార్ చెప్పాడనీ, అందుకే కొట్టి వేస్తున్నామని సిబ్బంది చెప్పారని స్థానికులు వాపోయారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ చెట్లను నరికివేసే వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.