Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లు మాత్రమే అనీ, వాతావరణ మార్పులను తగ్గించే దిశగా మొదటి అడుగులు వేయాలని ప్రొఫెసర్ చేతన్ సోలానికి ఐఐటీ ముంబై హెచ్చరించారు. వాతావరణ గడియారం మొదలైందనీ, భూమి ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరిగిపో తుందనీ, యావత్ ప్రపంచంతో పాటు భారతీయుడు సైతం విపత్తులోకి వెళ్లే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలకు పెరిగితే చేసేదేమీ లేదన్నారు. సోమవారం షేక్ పేట జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మహిళల కోసం) కళాశాలలో ప్రొఫెసర్ సోలంకి 11 ఏండ్లపాటు తన ఇంటికి వెళ్లకుండా, తన బృందంతో కలిసి సోలార్ బస్సులో నివసించి, అవగాహన కల్పించేం దుకు వాతావరణ మార్పులపై పోరాడేందుకు పరిష్కారా లను ప్రతిపాదించేందుకు ప్రతిజ్ఞ చేశారు. అందులో భాగంగానే నగరానికి వచ్చిన ఆయన విద్యార్థులు చదువు లేని ప్రతి ఒక్కరినీ చదువుకున్న వారి వల్లే అవగాహన కల్పించి (ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్), మన భవిష్యత్ తరాల స్థిరత్వం కోసం పని చేయడానికి మనకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని చెప్పారు. వాతావరణ మార్పు దిద్దుబాటు చర్యల పై 5 పాయింట్ల అవగాహన సదస్సు'' ఆరుషి ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి వ్యక్తి చదువు కున్న వారిగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఇటీవల వర-జూaశ్రీ.శీతీస్త్ర పోర్టల్ని ప్రారంభించామన్నారు. శిక్షణ ఉచి తంగా అందిస్తామనీ, శక్తి ఉత్పత్తి, దాని వినియోగం, దుర్వినియోగం, శక్తిని ఆదా చేసే అవకాశాలు, స్వచ్ఛమైన శక్తిని ఎలా ఉత్పత్తి చేయాలి అనే అవగాహనను కల్పిస్తూ ఇది 100శాతం సౌర ఆత్మనిర్భర్తను సాధించడానికి వ్యక్తు లు సంస్థలకు సహాయపడుతుందనీ, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నంబర్ 7,12,13కి సమాంతరంగా ఉందనీ దీన్ని, ఇటీవలే ప్రధానమంత్రి ప్రారంభించారాని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రకృతిలో సాధార ణంగా జీవకోటి గ్రాములకు కావాల్సిన అన్ని రెండు నుంచి 300 ఏండ్లు అందుబాటులో ఉంటాయనీ, వాటిని విచ్ఛిన్నం చేసేందుకు బొగ్గు గనులతో పాటు చిమ్ముడు సిమెంటు ఉత్పత్తులు చేస్తూ పర్యావరణాన్ని ప్రకృతిని నిత్యం చేసి విపత్తును స్వయంగా మనమే తయారు చేసు కుంటున్నామనీ, దీని కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు నారాయణమ్మ కాలేజీ యజమాన్య అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.