Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ
- కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. జీహెచ్ఎంసీ ఫలక్‌నుమా సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ రాజేందర్‌రెడ్డి పర్యవేక్షణలో బహదూర్ పురా దేవి బాగ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్ర మాన్ని ఆయన బహదూర్ పుర ఎమ్మెల్యే మోసం ఖాన్, దేవి బాబు కార్పొరేటర్ సలీంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవడం ఎలా కృషి చేయాలని మెడికల్ అధికారి డాక్టర్ అన్నపూర్ణకు సూచించారు. అనంతరం కిషన్బాగులోని కిషన్ బాగ్ పార్క్ కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించి మెడికల్ అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కిషన్‌బాగ్ కార్పొరేటర్ హుస్సేనీ పాషా, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ మల్లీ శ్వరీ, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ రాజేందర్ రెడ్డి, మెడికల్ అధికారి డాక్టర్ సన, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, యూసీడీ, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.