Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ భారత సమితి కన్వీనర్ ప్రొ. గాలి వినోద్ కుమార్ పిలుపు
నవతెలంగాణ-ఓయు
మతం మారిన దళిత క్రైస్తవులు, ముస్లింలు, ఆదివా సులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ, దళిత క్రైస్తవ ముస్లింలకు షెడ్యూల్ కులాల హౌ దా కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవా రం వరంగల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ ఆవరణంలో జరిగే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాల్సిందిగా దక్షిణ భారత సమితి కన్వీనర్ ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయాల డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొ. గాలి వినోద్ కుమార్ కోరారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. క్రైస్తవ మతానికి మారిన అగ్రవర్ణాలకు, ఓబీసీలకు, చివరికి గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం మార్చుకున్న దళిత, క్రైస్తవ, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం దళితులపై వివక్షత కాదా అని ఆయ ప్రశ్నించారు. దళితులు హిందూ మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, అది ప్రాథమిక ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే నన్నారు. అందుకు అడ్డు వస్తున్న భారత రాజ్యాంగ నిబంధన రాష్ట్రపతి ఆర్డినెన్స్ పేజి నెంబర్ మూడును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో సుమారు 45 శాతం ఉన్న ఈ వర్గాలు ఏ పార్టీకైనా ఓటు వేయకపోతే ఆ పార్టీలు గెలుస్తాయని ఆయన ప్రశ్నిం చారు. చివరికి దళితుల పార్టీగా ముద్రపడిన బహుజన సమాజ్ పార్టీ దళిత క్రైస్తవ ముస్లింల రిజర్వేషన్ల పట్ల సానుకూలంగా లేకపోవడం సిగ్గుచేటన్నారు. భవిష్యత్తులో ఈ వర్గాల సమక్షంలో వారి హక్కుల కోసం ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ప్రత్యేక పార్టీ ఏర్పాటు అవుతుందని, వరం గల్ సిం హగర్జన సభలో అట్టి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. ఇంటికో దళిత క్రైస్తవుడు, దళిత ముస్లిం, క్రైస్తవ ఆది వాసీలు వేలాదిగా తరలిరావాలని పిలుపు ఇచ్చారు.