Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని డాక్టర్ కరుణాకర్ రెడ్డి, చత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాజా జిలాని అన్నారు. రవీందర్ నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ సభ్యులు, కాలనీ అధ్యక్షుడు కష్ణ నాయక్ ఆధ్వ ర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డుతూ.. ఉచిత సేవ భావంతో ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నాయక్ నగర్లో నిర్వహించడం అనేది చాలా గర్వకారణం అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు పూనుకోవాల్సిందిగా యువ తను, స్వచ్ఛంద సంస్థలను కోరారు. ఓ మంచి కార్యక్ర మంగా భావించి, ఈ ఆలోచన రావడంపై రవీందర్ నాయ క్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. కాలనీ అధ్యక్షుడు కష్ణ నాయక్ మాట్లాడుతూ.. ఈ మెడికల్ క్యాంప్ ఉచిత సేవ్ భావంతో సహకరించడానికి వచ్చిన డాక్టర్ కరుణాకర్ రెడ్డిని, అదే దక్పథంతో పండ్లు, బిస్కెట్లు, ప్యాకెట్లు పంపిణీ చేసిన చత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాజా జిలాని లకు కతజ్ఞతలు తెలిపారు.పేదలకు మంచి ఆరోగ్యాని ప్రసాదించే చూడడమే (బీడబ్ల్యుసి) బంజారా వెల్పేర్ కమిటీ కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీడబ్ల్యుసి కమిటీ సభ్యు లు వి. రాంకుమార్ నాయక్, ఏ. శంకర్ నాయక్, సుందర్ నాయక్, సంతోష్, సక్కు,లచ్చిరాం నాయక్, నగేష్, లింబియా, కిషన్, మురారి, తదితరులు పాల్గొన్నారు.