Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్ పేట
జై గణేశా భక్తి సమితి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. ఆదివారం జై గణేష భక్తి సమితి గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై గణేశా భక్త సమితికి తన వంతు సహా య సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జై గణేశ భక్తి సమితి గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ అంగని బాలరాజ్, సమితి సభ్యులు వినోద్ సింగ్, యాదగిరి, అరవింద్, జైన్ కుమార్ చారి తదితరులు పాల్గొన్నారు.