Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అర్హులైన వారందరూ కంటి పరీక్షలు చేయించుకో వాలని సీనియర్ నాయకులు దాత్రిక్ నాగేందర్ బాబ్జి, ప్రధాన కార్యదర్శి సదానందు అన్నారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బబ్లు సింగ్, ఆటో, ఆనంద్, డాక్టర్ సి.మాధవి, తదితరులు పాల్గొన్నారు.