Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్లో విలీనం
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ సమావేశం వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశం ప్రధాన కార్యదర్శి ఎన్.బిక్షపతి, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, జనరల్ సెక్రెటరీ నారాయణ, సెక్రటరీ శివ శంకర్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి రఫీ ఉద్దీన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గిరిబాబు, జాయింట్ సెక్రెటరీ నరసింహులు, తెలంగాణ వెల్నెస్ సెంటర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అనాలా సాగి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ సమీర్, ట్రెజరర్ డాక్టర్ అనిత, తెలంగాణ వెల్నెస్ సెంటర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు, తెలంగాణ మెడికల్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అన్ని ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వెల్నెస్ సెంటర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్లో విలీనం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి, రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ ప్రసంగిస్తూ తెలంగాణ వెల్నెస్ సెంటర్లో ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్స్ ఔట్సోర్సింగ్లో పనిచేస్తారని, వారిని వీలైనంత త్వరగా వారి మాతృ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులుగా రెగ్యులర్ చేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.