Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించి సైదాబాద్ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీతోనే సాధ్యమన్నారు. డివిజన్ పరిధిలోని జీఏ 2 కాలనీ వద్ద నూతనంగా వేసిన సీసీ రోడ్లను కార్పొరేటర్ పరిశీలించారు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, రవాణా తదితర సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులదేనన్నారు. కాలనీ పరిసరాల ప్రాంతాల్లో పెరిగిన చెట్ల కొమ్మను తీయించారు. ఈకార్యక్రమంలో కాలనీవాసులు కృష్ణ మురళి, రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, వెంకట్రావు, రాజ్‌కుమార్, మాధవరెడ్డి, మోహన్ రావు, ఏఎస్ఎన్ మూర్తి, చంద్రయ్య, ఏఈ వెంకన్న, వర్కింగ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.