Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-సంతోష్ నగర్
రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం నేత అసవుద్దీన్ ఓవైసీ పని చేస్తున్నారని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేటర్లు అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. డివిజన్ పరిధిలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పారిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్‌తో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేవిధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా కాలనీల రోడ్లు బాగు చేయాలని ఎమ్మెల్యే అధికారులు, కార్పొరేటర్లకు సూచించారు. ఎక్కడైనా డ్రైనేజీ మ్యాన్హౌల్ మూతలు పాడై రోడ్డుపై ప్రవహించే దుర్గంధంతో విద్యార్థులకు వాహనదారులకు పాదాచారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఆ డివిజన్ కార్పొరేటర్లు, అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్థానిక ఎంఐఎం నాయకులు, యాక్టివ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.