Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బడంగ్ పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని చైర్మన్ అబ్దుల్లా సాది అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని పహడిషరీఫ్ 13వ వార్డులో గల మహ్మదీయ కాలనీలో రూ.20లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ పుష్పమ్మ కొండల్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహ్మదీయ కాలనీ అధ్యక్షులు హమీద్ ఖాన్, ఖదీర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.