Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను మొదలుపెడుతున్నట్టు గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. రూ.8.07 లక్షలతో ఉల్లిగడ్డ బస్తీ నుంచి వారాల పోచమ్మ ఆలయం వరకు 88 మీటర్ల పొడవునా నూతన వీడీసీసీ రోడ్డు నిర్మా ణం పనులు మొదలు కాబోతున్న నేపథ్యంలో డిప్యూటీ ఇంజినీర్ సన్ని, జలమండలి అధికారులతో కలిసి ఉల్లిగడ్డ బస్తీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. బస్తీవాసులు తరచూ తమకు మంచినీటిలో ప్రెషర్ సమస్యపై ఫిర్యా దులు ఇస్తున్నారనీ, వెంటనే వారి సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపాలని వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కార్తిక్ రెడ్డి, మేనేజర్ కృష్ణ మోహన్‌కు సూచిం చారు. నూతన రోడ్డు నిర్మాణం ముందే, డ్రయినేజీ మ్యాన్ హౌల్ రిపేర్ లు, నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ పర్యటనలో బీజేపీ నగర యువ నాయకులు వినరు కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయిచంద్, శ్రీకాంత్, సత్తి రెడ్డి, ఆనంద్ రావు, బస్తీవాసులు శివ కుమార్, సురేందర్, సలావుద్దీన్ మహిళలు షేక్ మస్తాని, సంగమ్మ, బిబస్సా, రాధిక, తదితరులు పాల్గొన్నారు.