Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
నవతెలంగాణ-బడంగ్ పేట్
పూర్వ కాలం నుండి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ భూములను పార్కులకు కేటాయించి వారి అవసరాల కోసం ఉపయోగిస్తారు. కాని ఇక్కడ అలా కాకుండా ప్రభుత్వ భూములైన ఎఫ్టీఎల్ భూములను, పార్కులను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ఆక్రమంగా కోట్లాది రూపాయలు గడుస్తున్నారనే ఆరోణలున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్‌గూడలోని కోమటి కుంట సర్వే నెంబర్ 135,136లో 3వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే సర్వే నెంబర్ 124,125,128,195,130,131లోని పార్కు స్థలాలు సైతం కబ్జాకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు బాలాపూర్ మండల తహశీల్దార్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోచమ్మ కుంట, ఎర్రకుంట సర్వే నెంబర్ 85,86లోని ప్రభుత్వ ఎఫ్టీఎల్ భూములను కొందరు ఆక్రమణకు గురి చేసి ఇండ్ల నిర్మాణ పనులను యథేచ్చగా కొనసాగిస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని బహిరంగ ఆరోణలున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ముడుపులకు ఆశపడి కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదనే అరోపణలున్నాయి. ప్రజల సౌకర్యార్థం ఈ చెరువులను అభివద్ధి చేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేయించి చెరువుల సుందరీకరణ కోసం కషి చేస్తున్నారు. అయా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేశారు. ఇదే అదునుగా భావించిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాకింగ్ ట్రాక్ బయటి పక్కన ఉన్న కోమటి కుంట చెరువు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఏకంగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. పోచమ్మకుంట, ఎర్రకుంట ప్రభుత్వ భూమిలో భూ కబ్జాదారులు ఆక్రమించి 2 వేల గజాల స్థలంలో ప్రహారీ గోడ నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈవిషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కోమటికుంట ప్రభుత్వ భూమిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయినా భూ ఆక్రమణదారులు అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిలో కబ్జాకు పాల్పపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలు కాలనీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ భూములను ఎవ్వరు ఆక్రమించినా వదిలేది లేదని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన కోట్లాది రూపాయల విలువ చేసే పార్కు స్థలాలను, ఎఫ్టీఎల్ భూములను గుర్తించి, పరిశీలించి బోర్డులు ఏర్పాటు చేయటంతోపాటు ప్రహారీ గోడలను ఏర్పాటు చేస్తాం.
- కమిషనర్ కష్ణ మోహన్‌రెడ్డి