Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోడుప్పల్లో బాధితల వంట వార్పు
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్ఫ్ బోర్డు స్థలాలంటూ రిజిస్ట్రేషన్లను నిలిపి వేయడాన్ని నిరసిస్తూ వక్స్ బోర్డు బాధితుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్యలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పటోళ్ల విక్రంరెడ్డి మాట్లాడుతూ.. బోడుప్పల్లో వక్స్ట్ బోర్డు స్థలాలంటూ రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొన్ని వేల కుంటుంబాలలు ఈ నిషేధం వల్ల నానా ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని విక్రంరెడ్డి డిమాండ్ చేశారు. వక్స్ట్ బాధితుల సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని విక్రం రెడ్డి పేర్కొన్నారు. ఈ ధర్నాలో కార్పొరేటర్లు కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త దుర్గమ్మ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ దత్తాత్రేయ శాస్త్రి, బీజేపీ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎనుగుల లక్ష్మయ్య జనిగె వెంకటేశ్ యాదవ్, రాసాల నర్సింగరావు యాదవ్, గండిపల్లి రాజు, ఎస్ఎం ప్రగతి, దేవరకొండ వెంకటచారి. సమాఖ్య అధ్యక్షులు చెంచల నర్సింగరావులతోపాటు వందలాది మంది బాధితులు పాల్గొన్నారు.