Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వంత పార్టీ కార్పొరేటర్లే చైర్పర్సన్పైనే తిరుగుబాటు
- అవినీతి ఆరోపణలు, అభివృద్ధిలో నిర్లక్ష్యమే కారణం
నవతెలంగాణ అబ్దుల్లాపూర్ మెట్
అవినీతి ఆరోపణలు, ఏకపక్ష నిర్ణ యాలు, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు లేకపోవడం, సహచర కౌన్సిలర్లతో కలివిడిగా లేకుం డా ఉండడం మొదలైనవి పెద్ద అంబ ర్‌పేట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వా సానికి తెరలేపాయి. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 24 వార్డులకు గాను టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 13, బీజేపీ, సీపీఐల నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక్కరు గెలు పొందారు. కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ అనుహ్య ప రిణామాల మధ్య టీఆర్ఎస్ అధికా రం చేజిక్కిచుకుంది. చైర్ పర్సన్‌గా చెవుల స్వప్న బాధ్యతలు స్వీకరించారు. పెద్ద అంబర్‌పేట మున్సిపల్ పాలకవ ర్గం ఏ ర్పాటై మూడేండ్లు ముగియడంతో చైర్ పర్సన్ స్వప్న అనేక అవినీతి ఆరోపణ లు, అభివృద్ధిపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సొంతపార్టీ కార్పొరేటర్లే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అదును కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెంది న పాలకవర్గ సభ్యులు అవిశ్వాసానికి మొగ్గుచూపారు. శనివారం పెద్ద అంబ ర్‌పేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ లపై అవిశ్వాస తీర్మానం కోరుతూ ము న్సిపల్ పాలకవర్గ సభ్యులైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిద్ధంకి కృష్ణారెడ్డి, చెవు ల హరిశంకర్, దశరథనాయక్, పాశం అర్చన, రోహిణిరెడ్డి, వడ్డేపల్లి విద్యావ తి, కాంగ్రెస్ పార్టీ చెందిన పండుగల జయశ్రీ, కందాడ అనుపమ, పసుల రాజేందర్ మురళీధ ర్‌రెడ్డి, గ్యారాల శ్రీనివాస్, బీజేపీకి చెందిన మద్ది నరేందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి దండెం కృష్ణారెడ్డిలు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.