Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాలు నాయక్
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ప్రతి గిరిజన నిరుపేదకు బెడ్రూమ్ మంజూరు చేసి ఆదుకోవాలని గిరిజన సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బాలునాయక్ పేర్కొన్నారు. గౌలిపుర డివిజన్ పార్వతినగర్ బంజారా బస్తీలో తెలంగాణ గిరిజన సంఘం సభ్యత్వం క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం.బాలునాయక్ మరియు జిల్లా అధ్యక్షులు వి.రామ్ కుమార్ స్థానిక బస్తీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.బీమ, బి.వెంకటేష్ అధ్వర్యంలో బస్తీ మొత్తం తిరిగి ఇంటింటికి గిరిజనుల సమస్యలపైన రాబోయే రోజుల్లో పనిచేయడానికి సంవత్సరానికి ఒక్కసారి సభ్యత్వం క్యాంపెయిన్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ బస్తీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అధ్యయనం చేయడం జరిగింది. గత 25-30 సంవత్సరాలుగా అనేక రకాలుగా పనిచేసుకుంటూ ఆటో డ్రైవర్లు బిల్డింగ్ వర్కర్స్ ఇళ్లలో పనిచేసే మహిళలు ప్రవేట్ క్యాప్స్ డ్రైవర్స్‌గా అక్కడున్న గిరిజనులు పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు 200 కుటుంబాలు అక్కడే అద్దె ఇండ్లలో నివాసం ఉంటున్నారు. పెరిగిన డీజిల్, గ్యాస్ పెట్రోల్ ధరల వలన ఎంత పనిచేసినా ఫలితం కనిపించట్లేదు. అద్దె కట్టాలన్నా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే వారిని గుర్తించి గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు గిరిజన నాయకులు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సింగ్ తదితరులు పాల్గొన్నారు.