Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హయత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
బీజేపీ కార్పొరేటర్లు అభివృద్ధి పనుల విషయంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొని శంకుస్థాపనలు చేస్తే కార్పొరేటర్లను డివిజన్లలో తిరగకుండా చేస్తామని హయత్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి మండిపడ్డారు. ఆదివారం హయత్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దక్షిణాది కాలనీలకు అధిక నిధులు తాను వున్నప్పుడు వచ్చాయని, సుమారు 4 కోట్ల రూపాయల ట్రంక్‌లైన్ పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే లేకుండా, కాలనీవాసులకు సమాచారం అందకుండా ఎలా కొబ్బరికాయలు కొడతారని కార్పొరేటర్ జీవన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యేపై ప్రోటోకాల్ విషయంలో సుమారు 45సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని బీజేపీ కార్పొరేటర్లు మరిచారా అని ప్రశ్నించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, తాము రెండేళ్లుగా ఎక్కడా కూడా ఇబ్బందులు పెట్టలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ఆయన వెంట మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు గుడాల మల్లేష్, భాస్కర్ సాగర్, యనాల కృష్ణా రెడ్డి, మహిళ అధ్యక్షురాలు అంజలి, అంజమ్మ, బాలునాయక్, గోవర్ధన్ నాయక్, మధు, కోట రవీందర్ రెడ్డి, సత్తిరెడ్డి, భాస్కర్‌గుప్తా, నగేష్, స్కైలాబ్, దేవరాం తదితరులు పాల్గొన్నారు.