Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల వేదిక
నవతెలంగాణ-సరూర్నగర్
ఫిబ్రవరి 3న సరూర్నగర్ జీహెచ్ ఎంసి సర్కిల్ ఆఫీస్ ముందు ఉదయం 10 గంటలకు, 9వ తేదీన ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమంకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు పిలుపు నిచ్చారు. ఆదివారం ఆర్కేపురం డివిజ న్లోని లేబర్ అడ్డా దగ్గర ప్రజా సంఘాల పోరాట వేదిక, సీిఐటీయూ, కేవీపీఎస్, మత్స్య కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వత్తి సంఘాలు, రజక సంఘం, మహిళా సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల వేదిక నాయకులు మాట్లాడుతూ ఇల్లు, స్థలాల మీద సర్వే భవన నిర్మాణ కార్మికుల ఆటో కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఇల్లు లేని పేదవాళ్లు గుర్తించి ఇండ్ల స్థలాలు సర్వే ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. ఈ ధర్నాకు ఇండ్లు స్థలాలు లేని నిరుపేద వాళ్ళందరూ కదిలి రావాలని ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపునిచ్చారు. సర్వేలో ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు, రంగారెడ్డి జిల్లా సీిఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్, కేబీపీఎస్ రంగారెడ్డి జిల్లా నాయకులు గంధం మనోహర్, మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కట్ట శ్రీనివాస్, సరూర్ నగర్ సర్కిల్ సీిఐటీయూ కన్వీనర్ మల్లెపాక వీరయ్య, సరూర్నగర్ మండలం బీసీ డబ్ల్యూ ప్రధాన కార్యదర్శి జి.చైతన్య, ఎండి లతీఫ్, ఎల్.శంకర్, చంద్రయ్య, ఆర్కే పురం లేబర్ అడ్డా అధ్యక్షులు వి.వెంకన్న, పరశురాములు, వి.ఎల్లయ్య, ఈ.యేసు, ఎం.యాదగిరి, వివిధ ప్రజాసంఘా నాయకులు పాల్గొన్నారు.