Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-తుర్కయంజాల్
మున్సిపాలిటీ అభివృద్ధి అజెండగా పనిచేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని పలు కాలనీలలో ఆయన అధికారులు, నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. 21వ వార్డులోని సూర్య సాయినగర్, గంగిరెడ్డినగర్ కాలనీ, శ్రీరామ్‌నగర్ కాలనీ, జనచైతన్య కాలనీలను కలియతిరి గారు. కాలనీవాసుల నుండి పలు వినతులు స్వీకరించారు. సాధ్యమైన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే పరిష్కరిం చారు. అనంతరం 12వ వార్డులోని వింటేజ్ హోమ్స్‌లో మరో ఆరు కాలనీల ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు. స్థానిక సమస్యలపై కాలనీవాసుల వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి, డైరెక్టర్ సామ సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండూరు వెంకటేష్, కౌన్సిలర్లు పుల్లగుర్రం కీర్తన విజయానందరెడ్డి, గుండా భాగ్యమ్మ ధనరాజ్, మాజీ సర్పంచ్‌లు కందాడ లక్ష్మారెడ్డి, చెవుల దశరథ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.