Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 300 మందికి పైగా సద్వినియోగం
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని 'ఏ' టైప్ క్వార్టర్స్ హుడా కాలనీ ఫేస్ టు కాలనీ వెల్ఫేర్ ఆఫీసులో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహించిన ఈ క్యాంపులో సుమారు 300 మంది పైగా ఈ మెగా క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్యాంపులో మిక్సివిన్ హై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోపాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అపోలో ఫార్మసీ హెల్త్ ప్రొడక్ట్స్, డెంటల్ హాస్పిటల్లకు సంబంధించిన బీపి, షుగర్, జనరల్ చెకప్, కంటి పరీక్షలు, ఈసీజీ, డెంటల్కు సంబంధించిన వైద్య సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సీిఐ కె.సత్యనారాయణ, వనస్థలి పురం టీిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా, టీిఆర్ఎస్ నాయ కుడు మధుగౌడ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆనంద్రాజ్, టీిఆర్ఎస్ పార్టీ వనస్థలిపురం మహిళా అధ్యక్షురాలు లతా ఆనంద్రాజ్, కాలనీ జనరల్ సెక్రెటరీ సతీష్ కుమార్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.