Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరకుండా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని, వాటి పరిష్కారానికి నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్ డివిజన్లో ఆదివారం స్థానిక నాయకులు, కాలనీవాసులచే కలిసి పలు కాలనీల్లో పాదయాత్ర చేసినట్లు ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దానిలో భాగంగా లెక్చరర్స్ కాలనీ, బాలాజీనగర్, త్యాగరాయనగర్, కె.వి.ఎన్.రెడ్డినగర్, ఆదిత్యనగర్, శ్రీరాంనగర్, లక్ష్మీభవానినగర్, ఎల్లారెడ్డి కాలనీ ఫేస్.2, సిరిహిల్స్, రాజా రాజేశ్వరి కాలనీ, శివగంగ కాలనీ, స్వాతి రెసిడెన్సీ, అంజలి రెసిడెన్సీ, పవన్ గిరి కాలనీ 1,2,3 వీరన్నగుట్టలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను ప్రస్తావించారు. దానిలో భాగంగా నూతన సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్స్, అదనపు కరెంటు స్తంభాలు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల ఆధునికీకరణ అవసరం ఉన్న చోట ట్రంక్ లైన్స్, బాక్స్ డ్రైన్స్ నిర్మించాలని సూచించారు. తదనంతరం మాట్లాడుతూ ముందుగా ప్రధాన రహదారి మీద వున్న సమస్యలు (వాటర్ లైన్స్, డ్రైనేజీ, రోడ్లు) పూర్తిచేసిన తరువాత, సబ్ రోడ్స్ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో దాదాపు 68 కిలోమీటర్ల మేర (దాదాపు 55 కాలనీలు) నూతన వాటర్ లైన్స్ కూడా మంజూరు అయ్యాయన్నారు. అట్టి పనులు కూడా ప్రారంభమవు తాయన్నారు. రోజుకు 300 మీటర్ల మేర పనులు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. అలాగే పెద్ద వర్షం వస్తే క్రీడా నుంచి వరదనీరు బాలాజీ కాలనీ గుండా కింది కాలనీలోకి రావడం జరుగుతుందని, క్రీడా పక్క నుండి బాక్స్ డ్రైన్స్ నిర్మించడం జరుగుతుందన్నారు. అలాగే మంచినీటి పైప్‌లైన్స్, డ్రైనేజీ లైన్స్ మధ్య ఒక మీటర్ స్థలం వదిలేవిధంగా పనులు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో కాలనీవాసులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. ఎలాంటి దుష్ప్రచార మాటలు నమ్మవద్దని తెలిపారు. ఇట్టి పనుల మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే అదనపు స్తంభాలు కూడా మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమన్నారు. ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారించడమే ముఖ్యమన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ 10బి జలమండలి జనరల్ మేనేజర్ వినోద్, ఏఈ రాజు, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు కోసనం ధనలక్ష్మి, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీష్ యాదవ్ నాయకులు కోసనం వెంకట్ రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, రమేష్, పారంద నర్సింగ్, చంద్రారెడ్డి, కె.కె.ఎల్.గౌడ్, అనిల్, జగదీష్ పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పతకాల కోసం క్రీడలు కాదు.. శారీరక శ్రమ కోసం
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు వారి ఆరోగ్యం కోసం మాత్రమే ఉండాలని ఎల్బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. ఆదివారం హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఇంటర్ స్కూల్స్ అథ్లెట్సిక్స్ ఛాంపియన్స్‌ను ఆయన విచ్చేసి ప్రారంభిం చారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ మన శరీరంలో నిత్యం చైన్ సిస్టంలాగా శారీరక శ్రమ తప్పకుండా ఉండాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. సెల్ఫోన్లు పక్కన పెడితే మానసికంగా దృఢంగా వుండగల్గుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ వాణి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, భాస్కర్ సాగర్, కోచ్ వినోద్, లీల తదితరులు పాల్గొన్నారు.