Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రిన్ ఫీల్డ్స్ పాఠశాల వార్షికోత్సవంలో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
విద్యార్థులకు సామజిక బాధ్యతతో కూడిన విద్య అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు అందుతాయని, అదేవిధంగా విద్యార్థులకు అన్ని రంగాల్లోని అంశాలపై అవగాహన కలిగి ఉండేలా విద్యా బోధన ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి గ్రీన్ ఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం వేడుకలు ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రితోపాటు స్థానిక మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, పాఠశాల డైరెక్టర్ పీఎల్ఎన్ రెడ్డిలు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరమని, విద్యతోపాటు అన్ని అంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియచేయాలని అన్నారు. స్కూల్ డైరెక్టర్ పీఎల్ఎన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను చదువుతోపాటు ఆట, పాటలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలపారు. విద్యార్థులు బాగా చదివేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ విజయరెడ్డి, కార్పొరేటర్ తూంకుట్ల ప్రసన్న శ్రీధర్‌రెడ్డి, సింగిరెడ్డి పద్మారెడ్డి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.