Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ పదో వార్డులో అక్రమంగా మేస్త్రీ సంఘంకు సంబంధించిన కొన్ని రూంలు అక్రమంగా నిర్మిస్తున్నారని వాటిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఆ వార్డ్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న ఆ రూములను నిర్మించకుండా అభివృద్ధి భవనాలను నిర్మాణం చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కాలనీ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.