Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
నాచారం డివిజన్ రామ్‌నగర్ కాలనీవాసులు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శ్రీరామ్‌నగర్ కాలనీ సమస్యలైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బాక్స్ డ్రైనేజ్, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల ముత్యంరెడ్డి, సీనియర్ నాయకులు టేకులపల్లి రామ్‌చందర్ శ్రీరామ్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి యూసఫ్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు సిద్ధార్థ, కాలనీవాసులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, బాబు, గౌస్ భాషా, రాజయ్య, కష్ణ తదితరులు పాల్గొన్నారు.