Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి 25వ స్వతంత్ర కార్పొరేటర్ లక్ష్మి కుమారీతో కలిసి 25వ డివిజన్ పరిధి భగత్ సింగ్ పార్క్‌ను సోమవారం సందర్శించి పార్క్‌లో జరుగుతున్న వాకింక్ ట్రాక్, ప్లాంటేషన్ వంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్క్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ లక్ష్మి సుబ్బారావు, ఆవుల పావని జగన్ యాదవ్, రాజేశ్వరి వెంగయ్య చౌదరి, ఎన్ఎంసి, ఎస్ ఈ, సత్యనారాయణ, అధికారులు సుదర్శన్, దాసయ్య, హార్టికల్చర్ నాగి రెడ్డి, ఎన్ఎంసి మెడికల్ ఆఫీసర్ అజీజ్, శనిటేషన్ ఇన్చార్జి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.