Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కంటి వెలుగు కార్యక్రమంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంలో వెనకడుగు వేసేదే లేదని చేయలేదని మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ పరిధి ఎన్టీఆర్ పార్క్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక స్వతంత్ర కార్పొరేటర్ లక్ష్మి కుమారితో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ ఏమైనా సదుపాయ లోపాలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ లక్ష్మి సుబ్బారావు, ఆవుల పావని జగన్ యాదవ్, రాజేశ్వరి వెంగయ్య చౌదరీ, శ్రీనివాస్ యాదవ్, ఎన్ఎంబీ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్, మెడికల్ ఆఫీసర్ అజీజ్, అధికారులు, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు, డాక్టర్లు మంజుల, కమల, చంద్రిక, తదితరులు పాల్గొన్నారు.