Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ కాలనీలోని రోడ్లు, డ్రయినేజీ సమస్యలను బస్తీ ప్రజలు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ మహాత్మాగాంధీ నగర్లో సోమవారం పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ నగర్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు పూర్తయ్యాయనీ, పెండింగ్ లో ఉన్న డ్రయినేజీ, సీసీ రోడ్ల పనులను సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని బస్తీవాసులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, నాగభూష ణం, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, రాములుగౌడ్, మౌలానా, ప్రదీప్ రెడ్డి, వాలి నాగేశ్వరరావు, పుట్టం దేవి, తదితరులు పాల్గొన్నారు.