Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొ రేషన్ పరిధిలో బాచుపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 248 బంధం కుంట చెరువు శిఖం, సర్వేనెంబర్ 283 పత్తికుంట చెరువు శిఖంలె అక్రమ నిర్మాణాలను తొలగించి, చెరువు లను రక్షించాలని సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ప్రజావాణిలో బీజేపీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆకుల సతీష్ మాట్లాడుతూ బాచుపల్లి గ్రామం, సర్వే నంబర్:248 నందు మొత్తం ప్రభుత్వ భూమి మొత్తం విస్తీర్ణం 6. 21 ఎకరాలు అనీ, ఇదే సర్వే నెంబర్లు నందు బంధం కుంట (లేక్ ఐడి 2858) విస్తీర్ణం 3.433 ఎకరాలు ఎఫ్టిఎల్ గా గుర్తిస్తూ 2017 ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేసిన ట్టు తెలిపారు. చెరువు శిఖం పూర్తి విస్తీర్ణం 6.21 ఎకరా లు అని రెవెన్యూ రికార్డులు చెబుతున్నా.. చెరువు విస్తీర్ణా న్ని 3.433 ఎకరాలుగా తగ్గిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ప్రస్తుతం చెరువు శిఖం మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించు కుని, చెరువు మొత్తానికి ఐరన్ ఫెన్సింగ్ వేసుకోవడం, చెరువు శిఖంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుం డానే విజన్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణకి అనుమతులు టిఎస్‌బిపాస్ ద్వారా హెచ్ఎండిఏ, రెవెన్యూ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమ తులు ఇవ్వడం చూస్తేనే ప్రభుత్వ భూమి కబ్జాకు అధికా రులు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని తెలిపారు. 2014లో హెచ్ఎండిఏ అధికారులు 5.289 ఎకరాలుగా గుర్తిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇదే అతనుగా భావించిన కబ్జారాయుడు పత్తికుంట చెరువు శిఖం భూమి 8 ఎకరాల స్థలం దర్జాగా కబ్జా చేసుకుని, సప్తపది ఫంక్షన్ హాల్, శ్రీరామ్ సిబిఎస్ స్కూల్ బిల్డింగ్, మరో బిల్డింగ్ నిర్మించుకున్నారని తెలిపారు. 2018 పూర్వం రెవెన్యూ అధికారులు చెరు శిఖంలోని అక్రమ నిర్మాణాలను కూల్చి వేసినట్టు తెలిపారు. 2021లో సప్తపది ఫంక్షన్ హాల్ ని చెరవుషికంలో ఉందని సీజ్ చేశారనీ, ప్రస్తుతం చెరువు శిఖంలో ఫంక్షన్ హాల్ మరో రెండు బిల్డింగులు, పక్క ఇండ్లు దాదాపు ఎనిమిది ఎకరాల స్థలం ఆక్రమించుకు న్నట్టు తెలిపారు. తక్షణమే రెవెన్యూ రికార్డుల ప్రకారం బంధం కుంట, పత్తికుంట చెరువు శిఖం స్థలం సర్వే చేసి గుర్తించి కాపాడాలనీ, చెరువు శిఖంలో ఇరిగేషన్ అనుమ తులు లేకుండా తప్పుడు అనుమతులతో నిర్మాణంపై తక్షణమే చర్యలు తీసుకొవాలనీ, ప్రభుత్వ చెరువు శిఖం ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుని చెరువులను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రసాద్‌రాజు, సీనియర్ నాయకులు శేషారావు, లక్ష్మయ్య, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.