Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాలు మేరకు సోమవారం బీఆర్ఎస్ మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి నేరేడ్మెట్ డివిజన్ లో పర్యటించారు. అధికారులతో కలిసి ఆయన డివిజన్ పరిధిలోని శైలి గార్డెన్ వద్ద న్యూ సెప్టిక్ ట్యాంక్ రీ కనస్ట్రక్ష న్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పా టించడం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ డీపీఎస్ఈ శ్రీనివాస్, కాలనీవాసులు పాల్గొన్నారు.