Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహ్మారెడ్డి
- కలెక్టరేట్లో ప్రజావాణి.. 65 వినతితుల స్వీకరణ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులు, ఆర్జీలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వాటిని వెంటవెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవా లనీ, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం శామీర్‌పేటలోని కలెక్టరేట్లో ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపుకలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ జిల్లాలోని ఆయా ప్రాంతా ల ప్రజలు తీసుకొచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో తమ వినతులు, అర్జీలు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి వస్తారనీ, సంబంధిత శాఖల అధికారులు వీలైనంత వరకు అప్పటికప్పుడు వెంటనే పరిష్కరిం చేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రజావాణిలో ఆర్జీలు, విజ్ఞప్తులు ఏమాత్రం పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరిం చాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల వారికి వాటిని అందజేసిి వెంటనే పరిష్కరించాలనీ, ప్రజల ఇబ్బందులు తీర్చాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 65 వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.