Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఉప్పల్
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ డివిజన్ పరిధిలోని ఉప్పల్ హిల్స్ కురుమనగర్‌లో స్థానిక కార్పొరేటర్ మందమల్ల రజిత పరమేశ్వరుడితో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఉప్పల్ హిల్స్ కురుమ నగర్‌ను అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఉప్పల్హిల్స్ కురుమ నగర్లో సీసీ రోడ్లతోపాటు కమ్యూనిటీ హాల్ డ్రయినేజీ వ్యవస్థను ఆదునీకరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కుర్మానగర్ అధ్యక్షుడు అబ్బయ్య, మురళి నరసింహ గౌడ్ సోమయ్య, మంగ సుధాకర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.