Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా జీవితమంతా పోరాటమే
- పదవుల కోసం ఏనాడు బాధపడలే
- డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్
నవతెలంగాణ-బడంగ్ పేట్
దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అని, తన జీవితమంతా దళిత, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయటం తప్ప పదవుల కోసం ఏనాడు బాధ పడలేదని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్ అన్నారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొ రేషన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెడతా మని చెప్పటం అస్యాస్పదంగా ఉందన్నారు. డిప్యూటీ మేయ ర్ ఆధికారాలేంటోనన్న విషయం కూడా తెలుసుకోకుండా వారు మాట్లాడటం అర్థరహితమన్నారు. స్వతంత్ర అభ్యర్థి గా, బీఎస్పీ నాయకుడిగా తనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తించి డిప్యూటీ మేయర్ పదవికి ఎంపిక చేశారన్నారు. తనను ఏనాడు బీజేపీ కార్పొరేటర్లు గౌరవించలేదని, సమ స్యలను పరిష్కారం చేయాలని అడగలేదని, మేయర్తోనే లోపాయికారిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా తెలియక మాట్లాడు తున్నారని, అవిశ్వాసం పేరుతో, దళితుడిననే అవిశ్వాసం పేరుతో తనను భయపెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల బీజేపీ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో దళిత కార్పొరేటర్ ఇంద్రసేనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. తనకు వచ్చిన గౌరవ వేతనంతో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిం చాలనే లక్ష్యంతో వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబురావు, నర్సింగ్రా వు, బొర్ర రజినీకాంత్, శ్రీను, ఎల్లేష తదితరులు ఉన్నారు.