Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఘట్కేసర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పేద లకు జీవన వెలుగు లాంటి దని ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగును 9వ రోజు ఆమె పరిశీలించరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంధత్వంతో ఏ ఒకరూ బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఈగొప్ప కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మొదటి విడుతలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 1.54లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కళ్లద్దాలు అందజేసినట్లు తెలిపారు. రెండో విడుతలో జూన్ 30వ తేదీవరకు నిర్వహించే కంటి వెలుగు శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తారన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, చందుపట్ల వెంకట్‌రెడ్డి, బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ దూసరి బాలరాజుగౌడ్, మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్, 3వ వార్డు యువజన సంఘం అధ్యక్షుడు వకిటి ప్రవీణ్‌రెడ్డి, నాయకులు లింగస్వామి, జంగయ్య ముదిరాజ్, డాక్టర్ ఫనిందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.