Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమెరికా పర్యటనలో ఉన్న హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గుడ్‌విల్‌లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో మంగళవారం భేటీ అయ్యారు. జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు న్యూయార్క్ సిటీ హాల్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం పురాతన కాలం నుంచి నేటికీ ప్రసిద్ధి చెందడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందుతుందన్నారు. అనంతరం హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ద్వారా భౌతికంగా అభివృద్ధి చెందిన సిటీలతో పరస్పర సహకారం, బిజినెస్‌లో అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇంతకుముందు కాలిఫోర్నియా సిటీ హైదరాబాద్ నగరంతో సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ఎంఓయూ ఒప్పందం చేసుకుని ఇరు నగరాలకు సంబంధించిన సంస్కతి, అకాడమీ పరంగా, పరస్పర అవకాశాలపై సహాయం తీసుకుంటున్నట్టు తెలిపారు. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఏప్రిల్ 30లోపు హైదరాబాద్‌కు విచ్చేసి నగరాన్ని వీక్షించాలని, అభివృద్ధి చెందిన ప్రదేశాలను, సిస్టర్ సిటీ రిలేషన్ షిప్లో భాగంగా చేసుకున్న ఎంఓయూ ప్రకారం టెక్నాలజీ, ఇతర పరస్పర మార్పిడి ఒప్పందం చేసుకోవాలని గద్వాల్ విజయలక్ష్మి న్యూయార్క్ మేయర్‌ను కోరారు.