Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
- బడంగ్పేట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-బడంగ్ పేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నార్సింహ్మరెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబావి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బడంగ్పేట్ చౌరస్తాలో మేయర్ పారిజాత నార్సింహ్మరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావటం హర్ష నియమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ యాత్ర సాగిందన్నారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు వి.ప్రభాకర్‌రెడ్డి, మనోహర్ పి.సుదర్శన్‌రెడ్డి, బాలు నాయక్, యూత్ కాంగ్రెస్ మహేశ్వరం అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు జంగయ్య, గోవర్దన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు తదితరులు పాల్గొన్నారు.