Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి
నవ తెలంగాణ -సరూర్ నగర్
ప్రస్తుత పోటీని సమర్థవంతంగా ఎదుర్కొని ఉద్యోగాలు సాధించాలని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం సరూర్‌నగర్‌లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం వీఎంఆర్ లాజిక్స్ వారు రూపొందించిన రీజనింగ్ క్లాస్ నోట్స్, అర్థమెటిక్ క్లాస్ నోట్స్, న్యూ ఎడిషన్ బుక్స్‌ను ఏసీపీ ముఖ్యఅతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల చేసిందన్నారు. ప్రతి విద్యార్థి సమయాన్ని వథా చేసుకోకుండా పుస్తకంతో ఎక్కువగా గడపాలన్నారు. కొన్ని రోజులపాటు సెల్ ఫోన్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, తద్వారా సమయాన్ని ఎక్కువగా చదువుకునేందుకు వినియోగించుకోవచ్చని అన్నారు. కషి, పట్టుదల ఉంటే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వీఎఫ్‌జీ చైర్మెన్ గౌరు శ్రీనివాస్, ఏఎస్పీ విజరుకుమార్, వీఎఫ్‌జీ డైరెక్టర్ మనోహర్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఉప్పల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.