Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రంలో విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఉప్పల్ డిపో వద్ద గల సంఘం కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్షణ్ మాట్లాడుతూ విద్యారంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి బడ్జెట్లోనూ విద్యకు నిధులు తగ్గిస్తున్నారే తప్ప పెంచడం లేదన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో విద్యకు 25% నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం సగం నిధులు కూడా కేటాయించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా 30%నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయాలని పుట్ట లక్ష్మణ్ కోరారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ అన్వర్, హరీష్, రాము, గణేష్, సందీప్, శివ, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.