Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మురుగు కాల్వ శుభ్రం చేస్తూ మూర్ఛ వచ్చి ఓ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మంగళవారం చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్పల్లి చిన్న తోకట్ట బాట షోరూం వద్ద ఎల్లేష్(30) కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. మంగళవారం తోటి కార్మికులతో కలిసి అతను కాలువను శుభ్రం చేస్తున్నాడు. అయితే అతనికి ఆస్మికంగా మూర్ఛ రావడంతో గిలగిలా కొట్టుకుంటూ పడిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న బోయిన్పల్లి పోలీసులు, కంటోన్మెంట్ బోర్డ్ అధికా రులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలియజేశారు.