Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే హన్మంతరావు
- లబ్దిదారులతో ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-నేరేడ్మెట్
దళితబంధు పథకం ద్వారా దళితులకు చక్కటి జీవనో పాధి లభిస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మం తరావు అన్నారు. నియోజకవర్గంలోని 100 మంది దళిత బంధు లబ్ధిదారులతో మంగళవారం ఎమ్మెల్యే తన నివా సంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. లబ్దిదారుల ను ఆప్యాయంగా పలకరించి వారి వ్యాపారం ఎలా నడు స్తుంది.. వారి బాగోగులు తెలుసు కొన్నారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దేశంలో ఎక్క డా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని, ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతు న్నాయన్నారు. దీనిని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దళిత బంధు లబ్దిదారులందరూ ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ బాలాజీ, కార్పొరేటర్ జితేంద్ర నాథ్, నాయకులు రాము యాదవ్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి,ఎస్ ఆర్ ప్రసాద్,సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డి, ఉపేందర్,పార్డు తదితరులు పాల్గొన్నారు.