Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-బేగంపేట్
జీరా కాంపౌండ్‌లోని ప్రజల సమస్యలు పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్లో పర్యటించి పలు అభివద్ధి పనులను ప్రారంభించారు. అలాగే కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముం దుగా జీరా లోని వతన్ హౌటల్ వద్ద రూ. 12.89 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు పనులను, జీరా ప్లే గ్రౌండ్ వద్ద రూ. 12.57 లక్షలతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు, హైదర్ బస్తీలోని మహావీర్ కాంప్లెక్స్ వద్ద రూ. 27.83 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పక్కనే ఉన్న పార్క్ లో అధికారులతో కలిసి మంత్రి పర్యటించి పార్క్‌లో వాకింగ్ ట్రాక్ నిర్మించాలని, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా మొక్కలను నాటడం వంటి పనులు చేపట్టి పూర్తిస్థాయిలో అభివద్ధి చేయాలన్నారు. కాలనీ ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశిం చారు. అదేవిధంగా పార్క్‌లోని శ్రీ రేణుక ఎల్లమ దేవాల యం పునర్నిర్మాణం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. శిధిలావస్థలో ఉన్న నిర్మాణాన్ని తొలగించి కమ్యునిటీ హాల్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలను అందజే యాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జీరా కాంపౌండ్ లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసు కున్నారు. శిధిలావస్థలో ఉన్న టాయిలెట్స్‌ను పునర్నిర్మిం చాలని, రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని కోరగా సమస్యను పరిష్కరిస్తామని, ప్రభుత్వం అవసరమైన చర్యలను చేపట్టిందని వివరిం చారు. ఈ స్థలాన్ని రెవెన్యు శాఖకు బదిలీ చేసేందుకు కొన్ని న్యాయపరమైన అవాంతరాలు, అడ్డంకులు ఉన్నాయని చెప్పారు. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కషి చేస్తుందని, వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరించేలా చూస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, హార్టికల్చర్ అధికారి రాఘవేందర్, శానిటేషన్ డీఈ శ్రీనివాస్, నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, బస్తీవాసులు చంద్రశేఖర్, రామకృష్ణ, నర్సింగ్ రావు, అభిషేక్, శ్రీను తదితరులు ఉన్నారు.