Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రఘునందన్‌ను కలిసిన బోడుప్పల్ భూ బాధితులు
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు వక్ఫ్ భూములంటూ మమ్మల్ని సర్కారు ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని దుబ్బాక ఎమ్మెల్యే రుఘునంధన్ రావుతో బోడుప్పల్ వక్ఫ్ భూముల బాధితులు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ భూమి బాధితుల జేఏసీ అధ్వర్యంలో బుధవారం కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. బాధితుల సమస్యను విన్న ఎమ్మెల్యే సదరు సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పెద్ది మొహన్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.