Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
సరూర్ నగర్ స్టేడియం జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్‌ను బుధవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి తన క్యాప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ మల్లేష్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సరూర్ నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని అయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలొనే ఇది అతిపెద్డ జాబ్ మేళా అని అయన తెలిపారు. దాదాపు 120 కంపెనీలు పాల్గొంటాయన్నారు. దాదాపు 10వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుందన్నారు. జాబ్ మేళాకు సహకరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏడో తరగతి నుండి పీజీ వరకు చదివిన వారంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. వికలాంగులు, మూగ, చెవిటి, అంధులు కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చినవారికి అదే రోజు సాయంత్రం అప్పాయింట్మెంట్ లెటర్ ఇస్తారన్నారు. ఉదయం 10 గంటల నుండి ఈ మేళా నిర్వహిస్తామన్నారు. ఉద్యోగాన్ని బట్టి దాదాపు రూ.15వేల నుంచి రూ.లక్ష వరకు జీతం లభిస్తుందన్నారు. సందేహాలుంటే 7286008234, 9505437112, 8247768371 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బారాస నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, డేరింగులు కృష్ణ, రాము, కళ్యాణ్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శేషగిరిరావు, బద్దం నరేందర్ గౌడ్, రమేష్, కిట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.