Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలలా
నవతెలంగాణ-సంతోష్ నగర్
ప్రజా సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అన్నారు. సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రయినేజీ, మంచినీరు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను బుధవారం ఆయన సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యేకు కార్పొరేటర్ శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.