Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి డీసీసీి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ - మీర్ పేట్
పెంచిన ఇంటి పన్నులను తగ్గించకపోతే మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడిస్తామని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్లో ఇంటి పన్నులు 200 శాతం పెంచారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మీర్పేట్ కార్పొరేషన్లో ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జీఎచ్ఎంసీలో సైతం ఇంతగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు లేవన్నారు. అధిక పన్నులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారంలోకొస్తే అధికంగా ఉన్న ఇంటి పన్నులను తగ్గిస్తామని ఆనాడు మంత్రి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయారని విమర్శించారు. ఇంటి పన్నులను నెల రోజుల్లో తగ్గించకపోతే ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా బాల్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, భాస్కర్ తదితరులు ఉన్నారు.