Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
నాచారం రాఘవేంద్రనగర్‌లో రూ. 20 లక్షలతో కొత్తగా వేస్తున్న సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను స్టాండింగ్ కమిటీ మెంబర్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ బుధవారం పర్యవేక్షించారు. నాణ్యతలో ఎటువంటి లోపాలున్న సహించేది లేదని కార్పొరేటర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేకర్, మేకల ముత్యం రెడ్డి, కట్ట బుచ్చన్న గౌడ్, అజ్మెరి, డిప్యూటీ ఇంజనీర్ రూప, అసిస్టెంట్ ఇంజనీర్ లింగారావు, వర్క్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.