Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కానీ కేసీఆర్ కుటుంబమే బాగుపడుతుందని కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. హౌసింగ్ బోర్డ్ డివిజన్లో ఇందిరానగర్ కాలనీ వాసులు బుధవారం ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరు కాగా ఇందిరానగర్ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలపై నిరసన వ్యక్తపరుస్తూ వినతి పత్రం అందించారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడంలో, వృద్ధాప్య పింఛన్లు అందించడంలో విఫలమైందని అన్నారు. దళిత బంధు పంపిణీ లో కూడా వారి పార్టీకి చెందిన నాయకులకు మాత్రమే కేటాయించుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ సీనియర్ నాయకులు జలగం వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి గురించి వారి నివాసానికి వెళ్లి లక్ష్మారెడ్డి, రాఘవ రెడ్డిలు పరామర్శించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజయ్య, సంజీవరెడ్డి, మల్లికార్జున గౌడ్ ఉన్నారు.