Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి
- భూ పోరాట ప్రాంతం సందర్శన
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ఎన్నికలో ఇచ్చిన హామీలల్లో భాగంగా 125 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, అందుకు పక్కా ఇంటి నిర్మాణం కోసం ఈ బడ్జెట్ సమావేశంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద అంబర్ పేట మున్సిపల్, కుంట్లూరులోని పాపయ్య గూడ లోని భూ పోరాటం ప్రాంతాన్ని శనివారం ఆయన సందర్శించారు.ఈ. సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బతుకు దెరువు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదలకు నివాసం లేక ఇంటి అద్దెలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంట ున్నారన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ ప్రభుత్వ భూములు బడా బాబులు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అదే పేదవాడు తలదాచుకుందామని గూడు ఏర్పాటు చేస్తే అధికారులు దాడులు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ లో భూపోరాటాల ద్వారా అనేక ప్రాంతాల్లో పేదల నివాస స్థలాలని ఇప్పించిన ఘనత సీపీఐకి దక్కిందన్నారు.పెద్ద అంబర్ పేట మున్సిపల్, కుంట్లూర్ సర్వేనెం. 215 నుంచి 224 లో భూదాన భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని 14 రోజులు అయిందని, ఇక్కడి ప్రజలకు సరియగు మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, స్థానిక ఎమ్మెల్యే , స్థానిక ప్రజాప్రతిధులు ప్రత్యేక చొరవ తీసుకొని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భూదానోద్యమ నాయకులు వినోబా స్పూర్తితో కుంట్లూర్‌లో సీపీఐ భూ పోరాటం నిర్వహిస్తుందన్నారు. నిజమైన పేదలు ఈ పోరాటంలో భాగం పంచుకోవాలన్నారు. తప్పుడు డాక్యుమెంట్స్ సష్టించి ఈ భూమి తనదేనంటూ ప్రగల్భాలు పలికే వ్యక్తులు వెనక్కి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నిజాలను/ వాస్త వాలను గుర్తించి అందుకు సంబంధించిన భూ డాక్యుమెం ట్లను పరిశీలించి పేదలకు ఇండ్ల స్థలాలకై భూమిని పంచడానికి రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. బహిరంగ సభకు వచ్చిన వేలాది ప్రజలను చూసి వారికి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ దిశానిర్దేశిని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న భూ పోరాట తీరుతెన్నులు, ప్రజల అవస్థలు వాస్తవాలని సీఎం కేసీఆర్ దష్టికి సీపీఐ బందం తీసుకెళ్తుందన్నారు.ఈ ప్రజా ఉద్యమ పోరాటం విజయవంతం కావాలని ,ప్రజలు మరింత సంఘటితంగా ఉద్యమించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా , జిల్లా కార్యవర్గ సభ్యులు సామెడి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, స్థానిక కౌన్సి లర్ పబ్బతి లక్ష్మణ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు చందు నాయ క్, జిల్లా సమితి సభ్యులు మాజీ కౌన్సిలర్ అజ్మీర్ హారిసింగ్ నాయక్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేణుగోపా ల్చారి మండలం నాయకులు : ఏషాల నరసింహ పొన్నాల యాదగిరి, కేతరాజు నరసింహ, నారాయణ, నారాయ ణరెడ్డి, నవనీత అరుణ దేవమ్మ సుజాత సక్రూ నాయక్, శ్రీదేవి, లక్ష్మి సుభద్ర, వెంకటేష్ మహేందర్ పాల్గొన్నారు.